హిందీలో అల్లు అర్జున్ 'డీజే' రీమేక్...
on Jul 10, 2020
షాహిద్ కపూర్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'ని హిందీలో అల్లు అరవింద్, అమన్ గిల్ తో కలిసి దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా హిందీలో ఆయనకు అదే తొలి చిత్రమ్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఆయన హిందీలో మరో సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారట. ఈసారీ రీమేక్ కథతో బాలీవుడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'ఆర్య', 'పరుగు' తరవాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా 'డీజే... దువ్వాడ జగన్నాథమ్'. ఇది హీరో, ప్రొడ్యూసర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీలో పాన్ ఇండియన్ అప్పీల్ కూడా ఉంది. అందుకని, రీమేక్ చేయడానికి దిల్ రాజు రెడీ అవుతున్నారని సమాచారం. బాలీవుడ్లో బీఆర్ చోప్రా ప్రొడక్షన్స్‌తో 'డీజీ' రీమేక్ చేయడానికి ఒప్పందం జరిగిందని టాక్.
తెలుగు సినిమాను డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్, హిందీ రీమేక్‌కి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందట. ఒకవేళ హరీష్ శంకర్ అందుబాటులో లేకపోతే మరో డైరెక్టర్ కోసం చూడాలని అనుకుంటున్నారట. ఒకవేళ హరీష్ శంకర్ ఎస్ అంటే వరుణ్ ధావన్ లేదా టైగర్ ష్రాఫ్... ఇద్దరిలో ఎవరో ఒకరు హీరోగా నటించవచ్చు. డిస్కషన్స్ జరుగుతున్నాయట.
Also Read